టీడీపీ ఎమ్మెల్యేను పరామర్శించిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు
- ఇటీవలే వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన సుబ్బారాయుడు
- రాజకీయ భవిష్యత్తుపై నేతలతో చర్చిస్తున్న మాజీ మంత్రి
- టీడీపీతో అనుబంధం నేపథ్యంలోనే రామా నాయుడుకు పరామర్శ
ఏపీకి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పరామర్శించారు. ఇటీవలే అనారోగ్యానికి గురైన రామా నాయుడు తన ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు ఆయనను పరామర్శిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తపల్లి సుబ్బారాయుడు బుధవారం నేరుగా పాలకొల్లు వెళ్లి, రామానాయుడును పరామర్శించారు. ఈ విషయాన్ని రామానాయుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సుబ్బారాయుడు... ఆ పార్టీలోనే ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మడి ఏపీ మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీల్లో చేరిన సుబ్బారాయుడు... మొన్నటిదాకా వైసీపీలో కొనసాగారు. 2024 ఎన్నికల్లో తాను తప్పనిసరిగా నరసాపురం నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానన్న విషయాన్ని మాత్రం చెప్పనని తెలిపారు. ఈ వ్యాఖ్యలను సీరియస్గా పరిగణించిన వైసీపీ అధిష్ఠానం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.
ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేకుండానే సాగుతున్న సుబ్బారాయుడు... త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరే దిశగా కదులుతున్నారు. ఈ క్రమంలో తన సొంత జిల్లాకు చెందిన నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.