'అగ్నిపథ్'పై మోదీ సర్కారుకు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రశ్నాస్త్రాలు
- అగ్నిపథ్ పథకానికి శ్రీకారంచుట్టిన కేంద్రం
- ఈ పథకం ద్వారా 10 లక్షల మందికి సైన్యంలో ఉద్యోగాలు
- పథకంపై పలు అనుమానాలున్నాయన్న వరుణ్ గాంధీ
- మీ అభిప్రాయమేమిటంటూ దేశ ప్రజలను ఉద్దేశించి ట్వీట్
భారత సైనిక దళానికి కొత్త జవసత్వాలను నింపడంతో పాటుగా దేశంలోని యువతకు 10 లక్షల ఉద్యోగావకాశాలను కల్పించే దిశగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అగ్నిపథ్ పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఎంపికయ్యే అభ్యర్థులకు ఇచ్చే జీత భత్యాలు, పెన్షన్, సేవల తర్వాత లభించే ఇతరత్రా అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సవివరంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనపై ఓ వైపు విపక్షాలు విమర్శలు సంధిస్తుంటే... మరోవైపు నరేంద్ర మోదీ సర్కారుకు సొంత శిబిరం నుంచి కూడా ప్రశ్నాస్త్రాలు ఎదురవుతున్నాయి.
బీజేపీ యువనేత, ఎంపీ వరుణ్ గాంధీ బుధవారం అగ్నిపథ్ పథకంపై ఓ ట్వీట్ సంధించారు. అగ్నిపథ్ పథకంపై దేశ యువతలో పలు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన దీనిపై మీ అభిప్రాయమేమిటంటూ దేశ ప్రజలను కోరారు. గతంలోనూ బీజేపీ సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలపైనా వరుణ్ గాంధీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.