మరో రికార్డును నెలకొల్పిన నీరజ్ చోప్రా

  • పావో నుర్మి గేమ్స్ లో 89.30 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరిన నీరజ్  
  • పాటియాలాలో జరిగిన పోటీల్లో 88.07 మీటర్ల దూరం విసిరిన వైనం
  • తన జాతీయ రికార్డును తానే అధిగమించిన నీరజ్  
భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా మరో రికార్డును నెలకొల్పాడు. ఫిన్ లాండ్ లో జరుగుతున్న పావో నుర్మి గేమ్స్ లో 89.30 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరి రికార్డు సృష్టించాడు. గత ఏడాది మార్చిలో పాటియాలాలో జరిగిన పోటీల్లో 88.07 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరి నీరజ్ చోప్రా జాతీయ రికార్డును క్రియేట్ చేశాడు. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమించాడు. గత ఏడాది ఆగస్టులో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ ను 87.58 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.    

టోక్యో ఒలింపిక్స్ తర్వాత తొలిసారి ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పావో నుర్మి గేమ్స్ లో చోప్రా పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఫిన్ లాండ్ అథ్లెట్ ఒలివర్ హిలాండర్ జావెలిన్ ను 89.83 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు.


More Telugu News