దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 8,822 కేసుల నమోదు
- 53,637కి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య
- 2 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే దాదాపు 9 వేల వరకు కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 4.40 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... 8,822 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ పెరుగుదల ముందు రోజు కంటే 33 శాతం అధికం కావడం గమనార్హం. ఇదే సమయంలో 5,718 మంది కోలుకోగా... 15 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 53,637కి పెరిగింది.
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4,32,45,517కి చేరుకుంది. వీరిలో 4,26,67,088 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,792 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.66 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, పాజిటివిటీ రేటు 2 శాతంగా, క్రియాశీల రేటు 0.12 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,95,50,87,271 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.
తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువ కేసులు మహారాష్ట్ర నుంచి వచ్చాయి. మహారాష్ట్రలో 2,956, కేరళలో 1,989, ఢిల్లీలో 1,118, కర్ణాటకలో 594 కేసులు నమోదయ్యాయి.