వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ లో మ్యాచ్ ల సంఖ్య పెంపు!
- ఇక రెండున్నర నెలల పాటు ఐపీఎల్ సందడి
- మొత్తం మ్యాచ్ ల సంఖ్య 94కి పెంపు
- ఆయా దేశాల బోర్డులతో మాట్లాడామన్న జై షా
- ఐసీసీ షెడ్యూల్ లో మార్పులు చేస్తున్నట్టు వెల్లడి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ-బిడ్డింగ్ లో ఆర్థిక విశ్వరూపం ప్రదర్శించిన నేపథ్యంలో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ లో మ్యాచ్ ల సంఖ్యను పెంచనున్నారు. ఐపీఎల్ లో ఓ సీజన్ నిడివి రెండున్నర నెలలు ఉండేలా ఐసీసీ షెడ్యూల్ లో మార్పులు చేయనున్నట్టు సమాచారం. ఆ లెక్కన ఓ ఐపీఎల్ సీజన్ లో 94 మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంది.
ఐపీఎల్ రెండున్నర నెలలు జరిగే అంశాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా నిర్ధారించారు. ఈ మేరకు తాము అన్ని దేశాల క్రికెట్ బోర్డులతోనూ, ఐసీసీతోనూ చర్చించామని వెల్లడించారు. తద్వారా ఐపీఎల్ కు అగ్రశ్రేణి అంతర్జాతీయ క్రీడాకారులు అందుబాటులో ఉండేందుకు మార్గం సుగమం అయిందని జై షా తెలిపారు. అంతేకాదు, వచ్చే సీజన్ నుంచి మహిళల ఐపీఎల్ కూడా తమ ప్రాధాన్యతాంశమని తెలిపారు.