ఈ నెల 22న భేటీ అవుతున్న ఏపీ కేబినెట్
- జగన్ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశం
- పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం
- రైతులకు ఈరోజు బీమా పరిహారాన్ని జమ చేసిన జగన్
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈ నెల 22న భేటీ కాబోతోంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో రైతన్నలకు రూ. 2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని వారి ఖాతాల్లో జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మూడేళ్లుగా రైతులకు పంట నష్టం విషయంలో ప్రభుత్వం తోడుగా నిలబడిందని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు మూడేళ్లలో రూ. 45 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పైసా అవినీతి కూడా జరగలేదని చెప్పారు. మీ బిడ్డ బటన్ నొక్కితే... డబ్బు నేరుగా మీ చేతికే వస్తోందని అన్నారు.