'777 చార్లీ' సినిమా చూసి కన్నీటిపర్యంతమైన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై

  • జూన్ 10న విడుదలైన 777 చార్లీ చిత్రం
  • వ్యక్తికి, పెంపుడు కుక్కకు మధ్య అనుబంధాన్ని చూపిన సినిమా
  • కర్ణాటక సీఎం కోసం ప్రత్యేక ప్రదర్శన
ఇటీవల విడుదలైన 777 చార్లీ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఓ వ్యక్తికి, అతడి పెంపుడు శునకంకి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ చిత్రంలో చూపించారు. కాగా, ఈ సినిమాను కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కోసం బెంగళూరులో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన సీఎం బసవరాజ్ బొమ్మై కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సినిమాలో కుక్కను చూడగానే, గతేడాది మరణించిన తన పెంపుడు శునకం స్నూబీ గుర్తుకువచ్చిందని చెబుతూ ఆయన తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. 

సినిమా అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పలుమార్లు కళ్లు తుడుచుకున్నారు. అంతేకాదు, 777 చార్లీ సినిమాను ప్రతి ఒ్కరూ తప్పక చూడాలని పిలుపునిచ్చారు. "శునకాలపై ఎన్నో సినిమాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రంలో జంతువుల భావోద్వేగాలను కూడా చూపించారు. ఈ సినిమాలో కుక్క తన కళ్ల ద్వారా భావాలను వ్యక్తీకరిస్తుంది. సినిమా చాలా బాగుంది. చూడాల్సిన సినిమా ఇది. కుక్క చూపించే ప్రేమ నిజంగా ఎలాంటి షరతుల్లేని ప్రేమ. అది స్వచ్ఛమైనది" అని బొమ్మై వివరించారు.


More Telugu News