ఇదీ చదువుల తల్లి బాసర సరస్వతి చెంత ట్రిపుల్ ఐటీ తాజా పరిస్థితి: రేవంత్ రెడ్డి
- బాసర ట్రిపుల్ ఐటీపై రేవంత్ రెడ్డి ట్వీట్
- కనీస సౌకర్యాలు లేవు, భోజన వసతి లేదని ఆరోపణ
- 169 మంది ప్రొఫెసర్లకు కేవలం 15 మందే ఉన్నారని వెల్లడి
- వీసీ అసలే లేరంటూ రేవంత్ ధ్వజం
- కేసీఆర్ దేశాన్ని ఉద్ధరించే పనిలో బిజీగా ఉన్నారంటూ ఎద్దేవా
బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రస్తుత పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మంగళవారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ పరిస్థితులు దిగజారిపోతుంటే... సీఎం కేసీఆర్ మాత్రం దేశాన్ని ఉద్ధరించే పనిలో బిజీగా ఉన్నారంటూ రేవంత్ ధ్వజమెత్తారు.
బాసర ట్రిపుల్ ఐటీలో తాజా పరిస్థితి ఏమిటన్న విషయాన్ని చెబుతూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ కనీస సౌకర్యాలు లేవని, భోజన వసతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 169 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట కేవలం 15 మందే ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక విద్యాలయానికి వీసీ అసలే లేరంటూ ధ్వజమెత్తారు. ఇదీ చదువుల తల్లి బాసర సరస్వతి చెంత ట్రిపుల్ ఐటీ తాజా పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు.