ముంబయిలో తొలిసారి కరోనా బీఏ4, బీఏ5 సబ్ వేరియంట్ కేసుల నమోదు
- ఒమిక్రాన్ లో రెండు సబ్ వేరియంట్లు
- బీఏ4, బీఏ5 అని నామకరణం
- ముంబయిలో ముగ్గురికి బీఏ4, ఒకరికి బీఏ5 పాజిటివ్
- నలుగురూ కోలుకున్నారన్న బీఎంసీ వర్గాలు
ఈ ఏడాది ఆరంభంలో ఉద్ధృతంగా వ్యాపించిన కరోనా ఒమిక్రాన్ వేరియంట్ లో కొన్ని ఉప వేరియంట్లు కూడా పుట్టుకొచ్చాయి. వాటికి పరిశోధకులు ఒమిక్రాన్ బీఏ4, ఒమిక్రాన్ బీఏ5 అని నామకరణం చేశారు. ఇప్పుడీ రెండు వేరియంట్లు ముంబయిలోనూ వెలుగుచూశాయి. ముంబయిలో నాలుగు బీఏ4, బీఏ5 సబ్ వేరియంట్ పాజిటివ్ కేసులు గుర్తించారు.
నగరంలో ఈ సబ్ వేరియంట్ కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. వీరిలో ముగ్గురికి బీఏ4 వేరియంట్ సోకగా, మరొకరు బీఏ5 బారినపడ్డారు. అయితే, వీరంతా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని, అందరూ కోలుకున్నారని ముంబయి కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం ఈ సబ్ వేరియంట్ కేసులు 13 నమోదయ్యాయి.
కొన్ని ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి మళ్లీ ఊపందుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్ లోనూ కొన్నిరోజులుగా రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది.