తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపే... పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..!
- ఈ ఏడాది పరీక్షలు రాసిన ఇంటర్ విద్యార్థుల సంఖ్య 9,07,393
- sbie.cgg.gov.in వెబ్ సైట్లోకి వెళ్లి ఫలితాలను చూసుకోవచ్చు
- జూన్ 25 లేదా 26న వెలువడనున్న పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న పరీక్షల ఫలితాలు వెలువడేందుకు సమయం ఆసన్నమయింది. ఇంటర్ పరీక్షా ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ ఏడాది దాదాపు 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలను రాశారు. సమాధాన పత్రాల మూల్యాంకనం 14 కేంద్రాల్లో కొనసాగింది. రేపు విడుదల కాబోతున్న ఇంటర్ రిజల్ట్స్ ను ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ sbie.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు. ఇదే వెబ్ సైట్ నుంచి ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పదో తరగతి ఫలితాల విషయానికి వస్తే... ఆన్సర్ షీట్స్ మూల్యాంకనం ఇంకా కొనసాగుతోంది. టెన్త్ రిజల్ట్స్ జూన్ 25న లేదా 26న ప్రకటించే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత ఇంటర్ ఫస్టియర్ క్లాసులు జులై 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ సెకండియర్ క్లాసులు ఈ నెలలోనే ప్రారంభమవుతాయి. 10వ తరగతి వరకు పాఠశాలలు నిన్ననే ప్రారంభమైన సంగతి తెలిసిందే.