'ఎఫ్ 3' 17 రోజుల వసూళ్లు ఇవే!
- క్రితం నెల 27న విడుదలైన 'ఎఫ్ 3'
- తొలివారం తరువాత తగ్గిన వసూళ్లు
- 17 రోజుల్లో 65.64 కోట్ల షేర్
- ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిన సినిమా
వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథనాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3' సినిమా తెరకెక్కింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా క్రితం నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఓపెనింగ్స్ తోనే ఈ సినిమా మొదలైంది. తొలివారంలో చెప్పుకోదగిన వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆ తరువాత ఆ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది.
17 రోజుల్లో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 18.70 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 65.64 కోట్ల షేర్ ను వసూలు చేసింది. 'ఎఫ్ 2' సినిమాకి మించి ఈ సినిమా ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పాడు. కామెడీ పాళ్లు .. రొమాంటిక్ పాళ్లు పెంచాడు. దాంతో ఆర్టిస్టుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే ఆశించిన స్థాయిని .. అంచనాలను అందుకోలేకపోయింది.
'ఎఫ్ 2' సినిమాలో సందర్భాన్ని బట్టి నవ్విస్తూ వచ్చిన అనిల్ రావిపూడి, ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలో నవ్వించడానికి ప్రయత్నించాడనే టాక్ వచ్చింది. ఇక 'ఎఫ్ 2' సినిమాలో రఘుబాబు .. అన్నపూర్ణమ్మ .. వై విజయ .. మెహ్రీన్ వైపు నుంచి ఉన్న కామెడీ .. మేనరిజమ్స్ ఈ సినిమాలో లోపించాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.