కోనసీమ అల్లర్లలో దగ్ధమైన మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ల ఇళ్ల ప్రాంతాన్ని పరిశీలించిన ఏపీ డీజీపీ

  • కోన‌సీమ జిల్లా పేరు మార్పుతో అమ‌లాపురంలో అల్ల‌ర్లు
  • మంత్రి విశ్వ‌రూప్‌, ఎమ్మెల్యే స‌తీశ్ ఇళ్ల‌కు నిప్పు పెట్టిన ఆందోళ‌న‌కారులు
  • నేడు అమ‌లాపురంలో పర్యటించిన డీజీపీ
  • తాజా ప‌రిస్థితిపై పోలీసుల‌తో స‌మీక్ష‌
కోనసీమ జిల్లా కేంద్రం అమ‌లాపురంలో సోమ‌వారం ఏపీ డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డి ప‌ర్య‌టించారు. కోన‌సీమ జిల్లా పేరు మారుస్తూ ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై భ‌గ్గుమ‌న్న ఓ వ‌ర్గం అమ‌లాపురంలో అల్ల‌ర్ల‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా పట్టణంలోని మంత్రి పినిపే విశ్వ‌రూప్‌, వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ స‌తీశ్ ఇళ్ల‌కు నిర‌స‌న‌కారులు నిప్పు పెట్టిన సంగ‌తి తెలిసిందే. 

ఈ ఘ‌ట‌న‌ల‌తో అల్ల‌ర్లు జ‌రిగిన నాటి నుంచి అమ‌లాపురంలో పోలీసు ఆంక్ష‌లు కొన‌సాగుతూనే వున్నాయి. ఇప్పుడిప్పుడే అమ‌లాపురంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొంటోంది. దీంతో ప‌ట్ట‌ణంలోని తాజా ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించేందుకు డీజీపీ అమ‌లాపురం వెళ్లారు. ఈ క్ర‌మంలో ఆందోళ‌న‌కారుల చేతిలో కాలి బూడిదైన ఇళ్ల‌ను డీజీపీ ప‌రిశీలించారు. ప‌ట్ట‌ణంలో అల్ల‌ర్లు చెల‌రేగిన ప్రాంతాల‌ను కూడా ప‌రిశీలించారు. ప‌ట్ట‌ణంలో తాజా ప‌రిస్థితుల‌పై పోలీసు అధికారుల‌తో స‌మీక్షించారు.


More Telugu News