ఫస్టాఫ్ ఎలా తీయాలో నాకు తెలియదా?: వివేక్ ఆత్రేయ
- నాని తాజా చిత్రంగా వచ్చిన 'అంటే .. సుందరానికీ'
- ఎంజాయ్ మెంట్ సెలబ్రేషన్స్ నిర్వహించిన టీమ్
- విమర్శలపై స్పందించిన దర్శకుడు
- నిడివి తగ్గించే ఆలోచన లేదని స్పష్టీకరణ
వివేక్ ఆత్రేయ మొదటి నుంచి కూడా పూర్తి వినోదభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తున్నాడు. ఆయన తాజా చిత్రమైన 'అంటే .. సుందరానికీ' సినిమా ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొంతసేపటి క్రితం ఈ సినిమా 'సుందరమ్స్ సెలబ్రేషన్స్' పేరుతో ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ వేదికపై వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ .. "ఈ సినిమా ఫస్టాఫ్ చాలా స్లోగా ఉందని అంటున్నారు. హీరో హీరోయిన్స్ చిన్నప్పటి నుంచి చెబుతూ రావడం వలన అలా అనిపించింది ఉంటుంది. సెకండాఫ్ ను స్పీడ్ గా తీసిన నాకు ఫస్టాఫ్ స్పీడ్ గా ఉండాలని తెలియదా? సెకండాఫ్ మీకు కనెక్ట్ కావాలంటే ఫస్టాఫ్ అలా ఉండాల్సిందే.
ఇక ఈ సినిమా ఫస్టాఫ్ నిడివి ఎక్కువగా ఉంది .. తగ్గించే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఫస్టాఫ్ లో ఏది ఎంతవరకూ ఉండాలనేది ఆలోచన చేసుకునే తీశాము. అందువలన నిడివి తగ్గించే ఆలోచన లేదు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన మా టీమ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.