ఏపీ సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం పదవీకాలం పొడిగింపు
- జూన్ 3తో ముగిసిన అజేయ కల్లం పదవీ కాలం
- జూన్ 4 నుంచి ఏడాది కాలం పాటు పదవీ కాలం పొడిగింపు
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధాన సలహాదారుగా పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3తో అజేయ కల్లం పదవీ కాలం ముగిసింది. అయితే ఈ నెల 4 నుంచి ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు సోమవారం ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
2019లో అధికారంలోకి వచ్చాక.. విశ్రాంత ఐఏఎస్ అజేయ కల్లంను ముఖ్యమంత్రి జగన్ తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. ఈ పదవితో పాటు జగనన్న భూ హక్కు, భూరక్ష పథకం స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గానూ అజేయ కల్లం వ్యవహరిస్తున్నారు.