బంగినపల్లిని పోలిన మరో మామిడి రకం గంగా!... వివరాలు ఇవిగో!
- సంగారెడ్డి కేంద్రంగా ఐసీ మోహన్ ప్రయోగాలు
- మామిడిలో కొత్త రకాన్ని ఆవిష్కరించిన ఐసీ మోహన్
- మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రకం ఆవిష్కరణ
మామిడి పేరు వింటేనే నోరు ఊరడం ఖాయం. అలాంటిది బంగినపల్లి మామిడి పేరు వింటే మరింతగా నోరూరుతుంది. అలాంటిది ఇప్పుడు బంగినపల్లి మామిడిని పోలి ఉండే మరో రకం వస్తోందంటే అసక్తికరమే కదా. గంగా రకంగా నామకరణం చేసిన ఈ కొత్త మామిడి రకం వేరెక్కడో ఆవిష్కరణ కాలేదు. తెలంగాణలో, హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉండే సంగారెడ్డిలోనే ఈ కొత్త రకం మామిడి ఆవిష్కృతమైంది. ఈ కొత్త మామిడి రకాన్ని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు.
సంగారెడ్డి కేంద్రంగా గంగా నర్సరీ పేరిట ఏళ్ల నాటి నుంచి ఐసీ మోహన్ అనే ఔత్సాహిక రైతు ప్రయోగాలు చేస్తున్నారు. ప్రత్యేకించి ఫామ్ హౌస్‌ల ఏర్పాటులో నిష్ణాతుడిగా పేరుగాంచిన ఐసీ మోహన్ తన నర్సరీలో సరికొత్తగా బంగినపల్లి మామిడిని పోలిన కొత్త రకాన్ని ఆవిష్కరించారు. చూడ్డానికి అచ్చు గుద్దినట్లు బంగినపల్లిని పోలినట్లు ఉండే ఈ కొత్త రకానికి ఆయన తన నర్సరీ పేరునే పెట్టారు. ఈ కొత్త మామిడి రకాన్ని ఆయన మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించారు.