తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు
- రెండ్రోజుల్లో తెలంగాణలో మరిన్ని ప్రాంతాలకు విస్తరణ
- రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు
- వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించాయని, మహబూబ్ నగర్ జిల్లా వరకు విస్తరించాయని వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలోని ఇతర భాగాలకు విస్తరిస్తాయని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో మూడ్రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది.
వాస్తవానికి ఈ నెల 8న తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే, కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రుతుపవనాల గమనానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. జూన్ రెండో వారంలో కూడా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొని ఉండడం కూడా రుతుపవనాల ముందంజకు ప్రతిబంధకంగా మారాయని నిపుణులు విశ్లేషించారు.