కొండా ఫ్యామిలీ మూలాన ఇదీ నా పరిస్థితి: రాంగోపాల్ వర్మ
- కొండా మురళి జీవిత కథ ఆధారంగా కొండా చిత్రం
- ఈ చిత్రానికి దర్శకుడిగా రాంగోపాల్ వర్మ
- చిత్ర బృందంతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న కొండా ఫ్యామిలీ
- కొండా ఫ్యామిలీతో కలిసి దుర్గమ్మ సేవలో పాల్గొన్న వర్మ
తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయవేత్త కొండా సురేఖ భర్త కొండా మురళి జీవిత కథ ఆధారంగా కొండా పేరిట సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నిర్మాణం దాదాపుగా పూర్తి అయి విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కొండా సురేఖ తన కుటుంబంతో పాటు చిత్ర బృందాన్ని వెంటబెట్టుకుని సోమవారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కొండా ఫ్యామిలీ అభ్యర్థన మేరకు రాంగోపాల్ వర్మ కూడా కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆలయంలో కొండా సురేఖ పక్కనే కూర్చుని రాంగోపాల్ వర్మ దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ... 'కొండా ఫ్యామిలీ మూలాన ఇదీ నా పరిస్థితి' అంటూ ఓ కామెంట్‌ను కూడా జత చేశారు.