ఐపీఎల్ మీడియా రైట్స్.. ప్యాకేజీ ఏ, బీకి రూ 43,255 కోట్లు
- ప్యాకేజీ ఏకి రూ.23,575 కోట్లు
- ప్యాకేజీ బీకి రూ.19,680 కోట్లు
- విజేతలను ప్రకటించనున్న బీసీసీఐ
ఐపీఎల్ మీడియా హక్కులు ప్యాకేజీ ఏ, ప్యాకేజీ బీ వేలాన్ని నిలిపివేశారు. ప్యాకేజీ ఏ వేలాన్ని రూ.23,575 కోట్ల వద్ద, ప్యాకేజీ బీ వేలాన్ని 19,680 కోట్ల వద్ద ఆపేశారు. అంటే రెండు కలిపి రూ.43,255 కోట్లు పలికినట్టు. ఈ రెండింటినీ కలిపి చూస్తే ఒక్కో మ్యాచ్ రూ.105.5 కోట్లు పలికింది. ప్యాకేజీ సీ, డీ ఇంకా ఆరంభించనేలేదు. కానీ, ఈ నాలుగు ప్యాకేజీలకూ కలిపి (గతంలో ఒక్కటిగానే ప్యాకేజీ) ఒక్కో మ్యాచ్ కు స్టార్ ఇండియా ఇప్పటి వరకు చెల్లించిన మొత్తం రూ.54.5 కోట్లుగానే ఉండడం గమనించాలి.
బీసీసీఐ ఐపీఎల్ మీడియా రైట్స్ ను నాలుగు కేటగిరీలు చేసింది. భారత ఉప ఖండంలో టీవీ హక్కులను ప్యాకేజీ ఏ కింద.. భారత ఉప ఖండంలో డిజిటల్ ప్రసార హక్కులను ప్యాకేజీ బీ కింద.. 18 నాన్ ఎక్స్ క్లూజివ్ మ్యాచ్ ల హక్కులను ప్యాకేజీ సీ కింద.. విదేశీ టీవీ, డిజిటల్ రైట్స్ ను ప్యాకేజీ డీ కింద వర్గీకరించింది.
ప్యాకేజీ ఏ కింద రూ.23,575 కోట్లకు గాను ఒక్కో మ్యాచ్ కు రూ.57.5 కోట్లు బిడ్డింగ్ చేసినట్టు అయింది. డిజిటల్ రైట్స్ రూ.19,680 కోట్లు పలకడంతో.. ఒక్కో మ్యాచ్ కు రూ.48 కోట్లు బిడ్డింగ్ దాఖలైంది. విజేతలు ఎవరన్నది బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది.