ఈడీ విచారణకు హాజరైన రాహుల్.. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తల నిరసన!

  • నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరైన రాహుల్
  • ఈడీ కార్యాలయం వద్ద రాహుల్ ను వదిలి వెళ్లిన ప్రియాంకాగాంధీ
  • పార్టీ కార్యాలయంలో నిరసన చేపట్టిన సీనియర్ నేతలు
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేరుకున్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను వెన్నంటి వచ్చారు. సత్యాగ్రహ మార్చ్ ను చేపట్టారు.  

మరోవైపు ఈడీ కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన సోదరుడిని ఈడీ కార్యాలయం వద్ద వదిలి, ప్రియాంకాగాంధీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

మరోవైపు ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వీరిలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగేల్, దిగ్విజయ్ సింగ్, పి.చిదంబరం, జైరామ్ రమేశ్, సచిన్ పైలట్, ముకుల్ వాస్నిక్, గౌరవ్ గొగోయ్, రాజీవ్ శుక్లా తదితరులు ఉన్నారు.


More Telugu News