మరోసారి 8 వేలకు పైగా కరోనా కేసుల నమోదు.. 50 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు!
- గత 24 గంటల్లో 8,084 కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,592
- 3.24 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనను పెంచుతోంది. వరుసగా మూడో రోజు 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,084 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,592 మంది కోలుకోగా... 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 47,995 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,32,30,101కి పెరిగాయి. ఇప్పటి వరకు 4,26,57,335 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,24,771 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.68 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,95,19,81,150 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 11,77,146 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
మరోవైపు నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 4,309 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2,946 కేసులు వచ్చాయి. కర్ణాటకలో 463, హర్యానాలో 304 కేసులు నమోదయ్యాయి.