నెగెటివ్ రోల్స్ చేయనుగాక చేయను: ఐశ్వర్య లక్ష్మి
- ఈ నెల 17వ తేదీన రిలీజ్ కానున్న 'గాడ్సే'
- ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్
- సత్యదేవ్ జోడీగా ఐశ్వర్య లక్ష్మి పరిచయం
- రొమాంటిక్ రోల్స్ ఇష్టమంటూ వ్యాఖ్య
సత్యదేవ్ కథానాయకుడిగా 'గాడ్సే' సినిమా రూపొందింది. అవినీతి రాజకీయాలపై బాధ్యత కలిగిన ఒక యువకుడి పోరాటం ఇది. సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాకి గోపీ గణేశ్ దర్శకత్వం వహించాడు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా ఐశ్వర్య లక్ష్మి పరిచయమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె చురుకుగా పాల్గొంటోంది.
తాజా ఇంటర్వ్యూలో ఐశ్వర్యలక్ష్మి మాట్లాడుతూ .. " హీరోయిన్ గా నా కెరియర్ ను మలయాళ సినిమాతో మొదలుపెట్టాను. రెండో సినిమానే తెలుగులో చేయవలసింది .. కానీ కుదరలేదు. నా 15వ సినిమాను తెలుగులో చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది.
ఈ సినిమాలో నేను వైశాలి అనే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. సత్యదేవ్ గొప్ప ఆర్టిస్ట్ .. ఆయన నుంచి నటన పరమైన చాలా విషయాలను నేర్చుకున్నాను. రోమాంటిక్ కామెడీ తరహా పాత్రలను చేయడం ఇష్టం. నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలను చేయడం ఇష్టం ఉండదు .. చేసే ఆలోచన కూడా లేదు" అని చెప్పుకొచ్చారు.