పంజాబ్ లో భారీగా తగ్గనున్న మద్యం ధరలు
- కొత్త ఎక్సైజ్ విధానానికి ఆమోదం తెలిపిన పంజాబ్ కేబినెట్
- మద్యం మానేసేందుకు ప్రయత్నించాలన్న ఆప్ ఎమ్మెల్యే
- మందు మానలేని పరిస్థితిలో ఉంటే తక్కువ తాగాలని సూచన
అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మద్యాన్ని ఒక పెద్ద సంపాదన మార్గంగానే చూస్తున్నాయి. మద్యం ధరలను పెంచుతూ ఖజానాను నింపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మద్యం అమ్మకాలు లేకపోతే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి కూడా లేదు. మరోవైపు ఇటీవల పంజాబ్ లో అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాలకు పూర్తి భిన్నంగా అడుగులు వేస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను గణనీయంగా తగ్గించనుంది. సరికొత్త ఎక్సైజ్ విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా మద్యం ప్రియులతో ఫరీద్ కోట్ ఆప్ ఎమ్మెల్యే గుర్దిత్ సింగ్ మాట్లాడుతూ... వీలైతే మద్యం మానేసేందుకు ప్రయత్నించాలని కోరారు. మందు మానలేని పరిస్థితిలో ఉంటే... తక్కువగా తాగడాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడం వల్ల మిగిలే డబ్బును ఇంటి అవసరాల కోసం వినియోగించాలని సూచించారు. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలని చెప్పారు.