దేశంలో పెద్ద పార్టీ అయితే ఏంటి గొప్ప.. రాష్ట్రంలో తుస్సే: బీజేపీపై అంబటి విమర్శలు
- ఆత్మకూరు ఉప ఎన్నిక నేపథ్యంలో కార్యకర్తల సమావేశం
- ప్రచారం కోసమే బీజేపీ నేతలు తనపై విమర్శలు చేస్తున్నారన్న అంబటి
- టీడీపీ బరిలో లేదు కాబట్టే బీజేపీ నేతలు కనిపిస్తున్నారని వ్యాఖ్య
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశంలో పెద్ద పార్టీ అయితే అయి ఉండొచ్చని, కానీ రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ తుస్సేనని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఆత్మకూరు ఉప ఎన్నిక నేపథ్యంలో నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో నిన్న వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న అంబటి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ బరిలో లేదు కాబట్టే బీజేపీ నేతలు కనిపిస్తున్నారని విమర్శించారు. అసలు వారి సైజెంత? వారికి వచ్చిన ఓట్లశాతమెంత? అని ప్రశ్నించారు.
ప్రచారం పొందాలన్న ఉబలాటంతోనే తనను ఏదో ఒకటి అంటున్నారని అంబటి అన్నారు. ప్రజాధనంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా అన్ని పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. మరో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి లక్ష ఓట్ల మెజార్టీ వచ్చేలా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించాలని కార్యకర్తలకు సూచించారు.