తెలంగాణలో 1000 దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య
- గత 24 గంటల్లో 13,254 కరోనా పరీక్షలు
- 129 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 104 కొత్త కేసులు
- 1,039కి పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య
తెలంగాణలో కరోనా రోజువారీ కేసులు గత కొన్నిరోజులుగా 100కి పైనే నమోదవుతున్నాయి. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 1000 దాటింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,94,458 మంది కరోనా బారినపడగా.... వారిలో 7,89,308 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,039 మంది చికిత్స పొందుతున్నారు.
గడచిన 24 గంటల్లో 13,254 కరోనా పరీక్షలు నిర్వహించగా, 129 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 104 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 9, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 8 కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో 67 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఇప్పటివరకు తెలంగాణలో 4,111 మంది కరోనాతో మృతి చెందారు.