టీమిండియా భారీ స్కోరు ఆశలకు కళ్లెం వేసిన సఫారీలు
- రెండో టీ20 మ్యాచ్ కు కటక్ ఆతిథ్యం
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
- మొదట బ్యాటింగ్ చేసిన భారత్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 రన్స్
దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 40, ఇషాన్ కిషన్ 34, దినేశ్ కార్తీక్ 30 (నాటౌట్) పరుగులు చేశారు.
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (1), కెప్టెన్ రిషబ్ పంత్ (5), హార్దిక్ పాండ్యా (9) విఫలమయ్యారు. కీలక సమయాల్లో వికెట్లు తీయడం ద్వారా సఫారీ బౌలర్లు టీమిండియా భారీ స్కోరు ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఆన్రిచ్ నోర్జే 2, రబాడా 1, వేన్ పార్నెల్ 1, ప్రిటోరియస్ 1, కేశవ్ మహారాజ్ 1 వికెట్ తీశారు.