తెలంగాణలో ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)
- ప్రశాంతంగా జరిగిన పరీక్ష
- 90 శాతం మంది హాజరు
- జూన్ 27న ఫలితాలు
- తెలంగాణ ఏర్పడ్డాక మూడోసారి టెట్ నిర్వహణ
తెలంగాణలో సుదీర్ఘ విరామం తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా టెట్ ప్రశాంతంగా ముగిసిందని అధికార వర్గాలు వెల్లడించాయి. పేపర్-1 పరీక్షకు 3,18,506 మంది హాజరయ్యారని... పేపర్-2కి 2,51,070 మంది హాజరయ్యారని టెట్ కన్వీనర్ వెల్లడించారు. మొత్తమ్మీద టెట్ కు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు. టెట్ ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్టు తెలిపారు.
కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టెట్ నిర్వహించడం ఇది మూడోసారి. తొలిసారి 2016 మేలో టెట్ నిర్వహించారు. ఆ తర్వాత 2017 జులైలో టెట్ జరపగా, మళ్లీ ఐదేళ్ల తర్వాత తాజాగా టెట్ నిర్వహించారు.
కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టెట్ నిర్వహించడం ఇది మూడోసారి. తొలిసారి 2016 మేలో టెట్ నిర్వహించారు. ఆ తర్వాత 2017 జులైలో టెట్ జరపగా, మళ్లీ ఐదేళ్ల తర్వాత తాజాగా టెట్ నిర్వహించారు.