టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ కు వాన ముప్పు
- కటక్ లో మ్యాచ్
- వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం
- ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సఫారీలు
టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో నేడు రెండో మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో చేజింగ్ చేసి గెలిచిన ఆత్మవిశ్వాసంతో సఫారీలు మరోసారి లక్ష్యఛేదనకే మొగ్గుచూపినట్టు అర్థమవుతోంది. కాగా, ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న కటక్ లో వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మ్యాచ్ కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు.
కాగా, ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవని తాత్కాలిక సారథి రిషబ్ పంత్ తెలిపాడు. అటు, చేతి గాయానికి గురైన క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్ లో ఆడడంలేదని, అతడి స్థానంలో హెన్రిచ్ క్లాసెన్ జట్టులోకి వచ్చాడని దక్షిణాఫ్రికా సారథి టెంబా బవుమా వెల్లడించాడు. యువ ఆటగాడు ట్రిస్టాన్ స్టబ్స్ స్థానంలో హెండ్రిక్స్ ను తీసుకున్నట్టు తెలిపాడు.