ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. చేసి చూపిస్తా: వైయస్ షర్మిల

  • ప్రజల పక్షాన నిలబడేందుకు పార్టీ స్థాపించా
  • కేసీఆర్ కు మరో ఛాన్స్ ఇస్తే సర్వనాశనం చేస్తారు
  • ప్రతిపక్షం మొద్దునిద్ర పోతోంది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ కు సీఎం పదవిని కట్టబెడితే.. గత ఎనిమిదేళ్లుగా ఆయన ఆడింది ఆట, పాడింది పాటగా పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం మొద్దునిద్ర పోతోందని అన్నారు. 

ప్రజల పక్షాన నిలబడేందుకే తాను పార్టీని స్థాపించానని షర్మిల చెప్పారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు. తాను అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తానని, ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా అమలు చేస్తానని, పోడు భూములకు పట్టాలు ఇస్తానని, రాష్ట్రాభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. కేసీఆర్ కు మరోసారి అధికారాన్ని అప్పజెపితే సర్వనాశనం చేస్తారని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మడుపల్లి గ్రామస్తులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News