కేసీఆర్ జాతీయ పార్టీపై కిషన్ రెడ్డి స్పందన
- టీఆర్ఎస్ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జాతీయ పార్టీ నాటకమన్న కిషన్ రెడ్డి
- కొత్త పార్టీని ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చని వ్యాఖ్య
- కేసీఆర్ అప్రజాస్వామిక పాలన పట్ల రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని విమర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారనే వార్తపై పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి అందరి దృష్టిని మరల్చేందుకే జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ కొత్త డ్రామా మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు.
ప్రజాస్వామ్య దేశంలో కొత్త పార్టీని ఏర్పాటు చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని... అయితే ఆయా పార్టీలు ప్రజాస్వామిక విలువలను అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు. కేసీఆర్ అప్రజాస్వామిక పాలన పట్ల తెలంగాణ ప్రజలు విసిగిపోయారని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో రాజకీయ నాయకులు పెరుగుతున్నారని విమర్శించారు.