ఇప్పటికే రష్యా దాడులతో అతలాకుతలం... మేరియుపోల్ నగరాన్ని పీడిస్తున్న కొత్త ముప్పు
- గత ఫిబ్రవరి 24 నుంచి రష్యా దాడులు
- మేరియుపోల్ నగరంలో తీవ్ర విధ్వంసం
- కుళ్లిపోతున్న శవాలు
- ప్రబలిన కలరా వ్యాధి
గత ఫిబ్రవరి 24 నుంచి రష్యా దాడులతో కుదేలైన ఉక్రెయిన్ ను ఇప్పుడు కొత్త సమస్య పట్టి పీడిస్తోంది. ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలుపెట్టాక రష్యా ప్రధానంగా దృష్టిసారించిన నగరాల్లో మేరియుపోల్ కూడా ఒకటి. రష్యా దాడుల అనంతరం ఆ నగరంలో శిథిలాల కింద గుట్టలుగుట్టలుగా శవాలు బయటపడుతున్నాయి. మృతదేహాలు ఎక్కడివక్కడే కుళ్లిపోతుండడంతో నగరంలో కలరా వ్యాధి ప్రబలింది. మేరియొపోల్ నగరంలోని బావుల్లో కూడా మృతదేహాలు ఉండడంతో, నీరు కలుషితమవుతోంది.
ప్రస్తుతం మేరియొపోల్ పై ఉక్రెయిన్ పట్టు కోల్పోయింది. దాంతో అక్కడ శవాలను తొలగించేందుకు ఎలాంటి వ్యవస్థ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో, కలరా వంటి అనారోగ్యాలతో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని మేరియుపోల్ నగర మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు.