ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హతపై లోక్ సభ స్పీకర్ కార్యాలయం స్పందన ఇదే
- సీఎంపై పార్టీ ఎంపీ ఆరోపణలు అనర్హత కిందకు రావు
- పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తేనే అనర్హత వేటు కిందకు వస్తుంది
- రఘురామ అనర్హత పిటిషన్‌పై లోక్ సభ స్పీకర్ కార్యాలయం
తమ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి పార్టీ అధినేత, సీఎం జగన్ పై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ ఏపీలో అధికార పార్టీకి చెందిన ఎంపీలు చేసిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం శనివారం స్పందించింది.
సీఎంపై పార్టీ ఎంపీ ఆరోపణలు అనర్హత వేటు కిందకు రావన్న లోక్ సభ స్పీకర్ కార్యాలయం పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తేనే అనర్హత వేటు కిందకు వస్తుందని తెలిపింది. సీఎం సహా మంత్రులను ఎంపీ విమర్శించినా కూడా అనర్హత కిందకు రాదని స్పీకర్ కార్యాలయం వెల్లడించింది.
ఇక ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్ ప్రివిలేజ్ కమిటీ ముందు ఉందన్న లోక్ సభ స్పీకర్ కార్యాలయం విచారణ ఎప్పుడు పూర్తి అవుతుందన్న విషయాన్ని కమిటీనే చెబుతుందని పేర్కొంది. అయితే టెన్త్ షెడ్యూల్‌కు మార్పులు చేయాల్సి ఉందని, దీనిపై ఓ కమిటీని వేశామని తెలిపిన స్పీకర్ కార్యాలయం... ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని తెలిపింది. ఎంపీలపై దాడి, పోలీసు కస్టడీలో వేధింపులు తమ పరిధిలోకి రావని ఆ కార్యాలయం ప్రకటించింది.