బహుభాషల వినియోగంపై ఐక్యరాజ్యసమితిలో తీర్మానం... తొలిసారిగా హిందీకి స్థానం

  • తీర్మానం ప్రతిపాదించిన భారత్
  • ఈ నెల 10న ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్
  • ఆమోదం తెలిపిన సభ
  • హిందీ, ఉర్దూ, బంగ్లా భాషలకు పచ్చజెండా
భారత్ ప్రతిపాదించిన బహుభాషల వినియోగం తీర్మానానికి ఐక్యరాజ్యసమితిలో ఆమోదం లభించింది. తొలిసారిగా హిందీకి కూడా అనధికార భాషల జాబితాలో స్థానం లభించింది. ఈ తీర్మానంపై ఈ నెల 10న దీనిపై ఓటింగ్ చేపట్టారు. ఇకమీదట ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కమ్యూనికేషన్స్ విభాగం తన సభ్యదేశాలకు సందేశాలు, ఉత్తరప్రత్యుత్తరాలను అధికారిక, అనధికారిక భాషల్లో పంపనుంది. ఈ భాషల జాబితాలో హిందీ కూడా చేరింది. 

హిందీతో పాటు ఉర్దూ, బంగ్లా భాషలకు కూడా స్థానం కల్పించారని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి వెల్లడించారు. ఐక్యరాజ్యసమితిలో ఇప్పటివరకు ఇంగ్లీషు, అరబిక్, ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్, చైనీస్ భాషలు అధికారిక భాషలుగా చెలామణీలో ఉన్నాయి. కొన్ని దేశాల్లో అత్యధికులు మాట్లాడే భాషలను కూడా ఐక్యరాజ్యసమితి కార్యకలాపాల్లో విరివిగా ఉపయోగించాలన్న కార్యాచరణలో భాగంగానే హిందీ తదితర భాషలకు తాజాగా ఆమోదం తెలిపారు.


More Telugu News