రికార్డుస్టాయి వ్యూస్ ను రాబట్టిన 'ది వారియర్' టీజర్!
- రామ్ హీరోగా రూపొందిన 'ది వారియర్'
- తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రను ధరించిన రామ్
- కథానాయికగా కృతి శెట్టి
- జులై 14వ తేదీన విడుదల
రామ్ తాజా చిత్రంగా 'ది వారియర్' రూపొందింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించాడు. తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైన ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి అలరించనుంది. తన కెరియర్లోనే తొలిసారిగా రామ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.
ఇటీవల వదిలిన ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో కలుపుకుని 20 మిలియన్ ప్లస్ వ్యూస్ రావడం విశేషం. రామ్ పాత్ర పైనే ఫోకస్ చేస్తూ .. యాక్షన్ సీన్స్ కి ప్రాధాన్యతనిస్తూ వదిలిన ఈ టీజర్ అందరికీ కూడా వెంటనే కనెక్ట్ అయింది. రౌడీలను కొట్టేసి పెయిన్ కిల్లర్ ఇవ్వడం కొత్తగా అనిపించింది. విలన్ గా ఆది పినిశెట్టి లుక్ ను రివీల్ చేశారు.
వీలైతే మారిపోండి .. లేకపోతే పారిపోండి' .. ' ధైర్యం అంటే వెతుక్కుంటూ వచ్చిన వాళ్లని కొట్టడం కాదు .. వెతుక్కుంటూ వెళ్లి కొట్టడం' వంటి డైలాగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో నదియా .. అక్షరగౌడ .. భారతీరాజా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. జూలై 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.