బలమైన శక్తిగా వైసీపీ.. ఆరిపోయే దీపంలా టీడీపీ: మంత్రి జోగి రమేశ్
- ఆత్మకూరు ఉప ఎన్నికపై జోగి రమేశ్ దృష్టి
- ఆత్మకూరులో పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు
- పోలింగ్ శాతం పెరిగేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు
- విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారన్న రమేశ్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో ఏపీ మంత్రి జోగి రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ బలమైన శక్తిగా ఎదిగిందన్న రమేశ్... విపక్ష టీడీపీ మాత్రం ఆరిపోయే దీపంలా మారిందని వ్యాఖ్యానించారు.
ఆత్మకూరు ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆత్మకూరులో శనివారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జోగి రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన టీడీపీ ఇతర పార్టీలకు లోపాయికారి మద్దతు ఇచ్చేందుకు ఏమాత్రం వెనుకాడదని ఈ సందర్భంగా జోగి రమేశ్ అన్నారు. ఫలితంగా ఉప ఎన్నికలో వైసీపీ మెజారిటీ తగ్గే అవకాశం ఉందని, టీడీపీ కుయుక్తులకు చెక్ పెట్టేలా పార్టీ శ్రేణులు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక మాదిరిగానే ఆత్మకూరు ఉప ఎన్నిక ఉంటుందని ఆయన చెప్పారు. పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా పార్టీ నేతలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.