సీఎం కేసీఆర్‌కు దీదీ ఫోన్.. 15న ఢిల్లీ సమావేశానికి రావాలని ఆహ్వానం
- ఈ నెల 15న ఢిల్లీలో తృణమూల్ జాతీయ స్థాయి సమావేశం
- త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికపై చర్చించే అవకాశం
- వివిధ పార్టీలకు చెందిన 22 మంది నేతలకు దీదీ ఆహ్వానం
- కేసీఆర్‌కు స్వయంగా ఫోన్ చేసిన దీదీ
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం ఫోన్ చేశారు. ఈ నెల 15న ఢిల్లీలో పలు రాజకీయ పార్టీల నేతలతో తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించనున్న సమావేశానికి రావాలంటూ ఈ సందర్భంగా కేసీఆర్‌ను దీదీ ఆహ్వానించారు.
జాతీయ స్థాయి రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ కీలక భూమిక పోషించే దిశగా మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశానికి రావాలంటూ పలు పార్టీలకు చెందిన 22 మంది జాతీయ స్థాయి నేతలకు దీదీ ఆహ్వానాలు పంపారు. ఇందులో భాగంగానే కేసీఆర్‌కు దీదీ ఫోన్ చేశారు.