బురద చల్లితే నీమీదే పడుతుంది... ఓ టీవీ చానల్ కు మంత్రి రోజా కౌంటర్
- టీవీ5 చానల్ పై రోజా విమర్శనాస్త్రాలు
- తనపై నిందలేస్తోందని ఆరోపణ
- ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్య
ఏపీ మంత్రి రోజా టీవీ 5 న్యూస్ చానల్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "పైసల కోసం బాబు భజన చేస్కో టీవీ5 చానల్" అంటూ వ్యాఖ్యానించారు. "ఎదుటివాళ్ల మీద బురద చల్లకు... తిరిగి అది నీమీదే పడుతుంది" అంటూ రోజా హితవు పలికారు. హిందువుల మనోభావాలు ఎవరు దెబ్బతీశారో అందరికీ తెలుసని, నిందలు వేసి తప్పుడు ప్రచారాలు చేస్తే నీకు, నీ బాబుకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
"టీవీ5... ఓ పచ్చ చానల్... ఇవాళ ఏ న్యూస్ లేక ఎంత దిగజారిపోయి అబద్ధాలు ప్రచారం చేస్తుందో అందరూ గమనించాలి. మొన్న తిరుపతిలో వైఎస్సార్ వాహన పథకంలో ట్రాక్టర్లు ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తే, ఎప్పుడో టీడీపీ సభ నాటి ఖాళీ కుర్చీల క్లిప్పింగ్ వేశారు. ఇవాళ తిరుమలలో నేనొక్కదాన్నే మంత్రి హోదాలో మహాద్వారం గుండా దర్శనానికి వెళితే మా గన్ మన్ కూడా వచ్చారని స్క్రోలింగ్ వేశారు. ఇది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఎందుకంటే అలాంటి తప్పులు మావాళ్లెప్పుడూ చేయరు. నేను కూడా అలాంటి తప్పులు చేయనని మీరు గమనించాలి.
చంద్రబాబునాయుడు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా పుష్కరాల సమయంలో పురాతన ఆలయాలను కూల్చేశాడు. ఈ చానల్స్ అన్నీ ఆరోజు ఎక్కడికి వెళ్లాయి? ప్రతి పూజలోనూ షూ, చెప్పులు వేసుకుని కనిపించినట్టు అనేక ఫొటోలు, వీడియోలు ఉన్నాయి... అప్పుడు ఈ చానల్స్ ఎక్కడికి వెళ్లాయి? తప్పు చేయని మామీద నిందలు వేస్తూ ప్రజల్లో మమ్మల్ని చులకన చేయాలని ప్రయత్నిస్తే ఆ ప్రజలే మీకు బుద్ధి చెబుతారు" అంటూ రోజా స్పష్టం చేశారు.