సిక్స్ కొడితే.. అభిమాని బీరు గ్లాసులో పడిన బంతి.. ఇదిగో వైరల్ వీడియో
- ట్రెంట్ బ్రిడ్జ్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్
- లాంగాన్ లో సిక్స్ బాదిన న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిషెల్
- ఇంగ్లండ్ అభిమానికి సారీ చెప్పి కొత్త బీరు ఇప్పించిన న్యూజిలాండ్ జట్టు
ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఫస్ట్ టెస్టులో శతకం బాది మాంచి జోరు మీదున్న న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిషెల్.. రెండో టెస్టులో తొలి రోజు ఆటలోనూ అదే జోరును ప్రదర్శించాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి మిషెల్ 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
అయితే, అతడు కొట్టిన రెండు సిక్సర్లలో ఒక సిక్స్ హైలైట్ అని చెప్పుకోవాలి. ఇంగ్లండ్ బౌలర్ జాక్ లీచ్ బౌలింగ్ లో లాంగాన్ మీదుగా మిషెల్ సిక్స్ కొట్టగా.. బంతి నేరుగా వెళ్లి స్టాండ్స్ లో పడింది. మామూలుగా స్టాండ్స్ లో పడితే ఫర్వాలేదుగానీ.. కొలత కొలిచినట్టు ఓ క్రికెట్ అభిమాని బీరు గ్లాసులో పడిపోయింది. అదే ఇప్పుడు వైరల్ అయింది. బంతి పడిన ధాటికి గ్లాస్ ముక్కలైంది. లాంగాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లండ్ పేసర్ మాథ్యూ పాట్స్.. బాల్ గ్లాసులో పడిందంటూ సైగల ద్వారా చెప్పడమూ కనిపించింది.
ఆ వీడియోను కాస్తా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. 'ఇంకో బీరు ఇప్పించండి..' అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. కాగా, బీరు గ్లాసు పట్టుకున్న అభిమాని పేరు సూసాన్ గా తర్వాత తెలిసింది. ఇంగ్లండ్ అభిమాని అయిన ఆమెకు న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ క్షమాపణలు చెప్పింది. కొత్త బీరును ఇప్పించింది. ఇటు డారిల్ మిషెల్ కూడా ఆమెను కలిసి మాట్లాడాడు.