కోరలు చాస్తున్న కరోనా.. ఒక్క రోజులో 8,329 కేసులు.. 10 మరణాలు
- నిన్న 3.44 లక్షల మందికి పరీక్షల నిర్వహణ
- మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ నుంచి ఎక్కువ కేసులు
- రోజురోజుకీ కేసుల్లో పెరుగుదల
మూడు నెలల పాటు దాదాపు కనిపించకుండా పోయిన కరోనా.. మరో విడత విరుచుకుపడుతోంది. జూన్ ఆరంభం నుంచి కేసుల్లో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. జూన్ లేదా జులై నెలాఖరుకు కరోనా నాలుగో వేవ్ రావొచ్చంటూ కొందరు నిపుణులు ముందుగా అంచనా వేశారు. తాజా కేసుల పెరుగుదలను గమనిస్తే ఆ అంచనాలు నిజమేనేమో అని అనిపిస్తోంది.
శుక్రవారం దేశవ్యాప్తంగా 3.44 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. 8,329 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 2.41 శాతంగా ఉంది. అదే సమయంలో ఈ మహమ్మారి నుంచి 4,216 మంది కోలుకున్నారు. ఇక ఈ వైరస్ కు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా 40,370గా ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రజలకు 194.92 కోట్ల టీకాలను ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న 3,081 మంది కరోనా బారిన పడితే, అందులో ముంబైలోనే 1,956 కేసులు వచ్చాయి. కేరళలో 2,415 కేసులు, ఢిల్లీలో 655 కేసులు వచ్చాయి.