తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 16,319 కరోనా పరీక్షలు
- 155 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 81 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 59 మంది
- ఇంకా 907 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి మరోసారి పెరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా రోజువారీ కేసుల సంఖ్య 150కి పైనే నమోదైంది. గడచిన 24 గంటల్లో 16,319 కరోనా పరీక్షలు నిర్వహించగా, 155 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 81 కొత్త కేసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11, సంగారెడ్డి జిల్లాలో 8 కేసులు గుర్తించారు. అదే సమయంలో 59 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.
తెలంగాణలో ఇప్పటివరకు 7,94,184 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,89,166 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నేపథ్యంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకాస్త పెరిగింది. ఇంకా 907 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.