వైసీపీకి ఓటేసినందుకు శాస్తి జ‌రిగిందంటూ.. ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ముందు లెంప‌లేసుకున్న వితంతువు

  • బాప‌ట్ల‌లో ఘ‌ట‌న‌
  • కొడుకు కారుంద‌ని వితంతు పింఛ‌న్ నిలిపేశార‌న్న శివ‌లీల‌
  • కారు లేద‌ని ర‌వాణా శాఖ నుంచి స‌ర్టిఫికెట్ ఇచ్చినట్లు వెల్ల‌డి
  • అయినా పింఛ‌న్ పున‌రుద్ధ‌రించ‌లేద‌ని ఆవేద‌న‌
  • డిప్యూటీ స్పీక‌ర్ ముందే లెంప‌లేసుకున్న బాధితురాలు
ఏపీలో అధికార పార్టీ వైసీపీ నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్యక్ర‌మంలో భాగంగా బాప‌ట్ల ఎమ్మెల్యేగా ఉన్న ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తికి శుక్ర‌వారం ఓ వినూత్న నిర‌స‌న ఎదురైంది. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో భాగంగా బాపట్ల‌లో ప‌ర్య‌టించిన కోన ర‌ఘుప‌తిని శివ‌లీల అనే వితంతువు నిల‌దీసింది. త‌న‌కు అందుతున్న వితంతు పింఛ‌న్ నిలిచిపోయింద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న కుమారుడికి కారు ఉందంటూ అధికారులు త‌న వితంతు పింఛ‌న్ నిలిపేశార‌ని ఆరోపించింది.

అయితే త‌న కుమారుడికి కారు లేద‌ని స్వ‌యంగా ర‌వాణా శాఖ నుంచి స‌ర్టిఫికెట్ ఇచ్చినా త‌న పింఛ‌న్‌ను పున‌రుద్ధ‌రించ‌లేద‌ని శివ‌లీల వాపోయింది. ఈ సంద‌ర్భంగా ఆమె ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీకి ఓటేసినందుకు త‌మ‌కు శాస్తి జ‌రిగింద‌ని చెప్పిన శివ‌లీల‌... కోన ర‌ఘుప‌తి ఎదుటే లెంప‌లేసుకుని మ‌రీ నిర‌స‌న తెలిపింది.


More Telugu News