మే నెలలో వచ్చినంత ఆదాయం టీటీడీ చరిత్రలో ఎప్పుడూ రాలేదు: ఈవో ధర్మారెడ్డి
- సద్దుమణిగిన కరోనా పరిస్థితులు
- తిరుమలలో మళ్లీ పూర్వపు రద్దీ
- మే నెలలో 22.62 లక్షల మంది భక్తుల రాక
- స్వామి వారికి రూ.130.29 కోట్ల ఆదాయం
కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో తిరుమలలో భక్తుల రద్దీ పోటెత్తుతోంది. ఇటీవల సర్వదర్శనాలు, శీఘ్రదర్శనాలకు టీటీడీ అనుమతించడంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కాగా, మే నెలలో శ్రీవారి ఆదాయంపై టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రకటన చేశారు.
తిరుమల వెంకన్నకు మే నెలలో హుండీ ద్వారా రూ.130.29 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. టీటీడీ చరిత్రలో ఓ నెలలో వచ్చిన అత్యధిక ఆదాయం ఇదేనని ధర్మారెడ్డి పేర్కొన్నారు. మే నెలలో స్వామివారిని 22,62,000 మంది భక్తులు దర్శించుకున్నారని వివరించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు రూ.1.86 కోట్ల మేర జరిగాయని తెలిపారు.