ఎల్లుండి నుంచి శ్రీవారి జ్యేష్టాభిషేకం...ఒక్కో టికెట్ ఖ‌రీదు రూ.400

  • ఈ నెల 12 నుంచి 14 వ‌ర‌కు జ్యేష్టాభిషేకం
  • రోజుకు 600 టికెట్ల చొప్పున విడుద‌ల‌
  • తిరుమ‌ల క‌రెంట్ బుకింగ్‌లోనే టికెట్ల విక్ర‌యం
క‌లియుగ దైవం తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి జ్యేష్టాభిషేకం ఈ నెల 12 (ఆదివారం) నుంచి 14వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. 3 రోజుల పాటు నిర్వ‌హించ‌నున్న ఈ సేవ‌లో పాలుపంచుకునేందుకు రోజుకు 600 మంది చొప్పున భ‌క్తుల‌ను అనుమతించేందుకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నిర్ణ‌యించింది. 

జ్యేష్టాభిషేకం సేవ‌లో పాల్గొనాల‌నుకున్న భ‌క్తుల‌కు ప్ర‌త్యేకంగా సేవా టికెట్ల‌ను విక్ర‌యించేందుకు కూడా టీటీడీ నిర్ణ‌యించింది. జ్యేష్టాభిషేకం సేవ‌కు సంబంధించిన ఒక్కో టికెట్ ఖరీదును రూ.400గా ఖ‌రారు చేసింది. మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న జ్యేష్టాభిషేకంలో పాల్గొనే భ‌క్తులు ముందు రోజు టికెట్ల‌ను కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. రోజుకు 600 టికెట్ల‌ను విక్ర‌యించ‌నున్నారు. తిరుమ‌ల‌లోని క‌రెంట్ బుకింగ్ కౌంట‌ర్ల‌లోనే ఈ టికెట్ల‌ను విక్ర‌యిస్తారు. 12వ తేదీ జ్యేష్టాభిషేకంలో పాల్గొనాల‌నుకునే వారు 11వ తేదీన టికెట్ల‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మేర‌కు టీటీడీ శుక్రవారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.


More Telugu News