కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమే: తెలంగాణ హెల్త్ డైరెక్టర్

  • తెలంగాణలో పాజిటివిటీ రేటు 0.7 శాతం నుంచి 1 శాతానికి పెరిగిందన్న హెల్త్ డైరెక్టర్ 
  • ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చని వ్యాఖ్య 
  • అయినా అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక 
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. తెలంగాణలో సైతం కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.7 శాతం నుంచి 1 శాతానికి పెరిగిందని తెలిపారు.

 కరోనా పెరుగుదల ప్రభావం మరో 4 వారాల నుంచి 6 వారాల పాటు ఉండొచ్చని చెప్పారు. కేసుల పెరుగుదల ఆందోళన కలిగించే విషయమే అయినప్పటికీ... ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చని అన్నారు. అయినప్పటికీ అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అందరూ విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఏమాత్రం కోవిడ్ లక్షణాలు కన్పించినా వెంటనే హెల్త్ సెంటర్ కి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.


More Telugu News