ఏలియన్లపై పరిశోధనలకు నాసా సైంటిఫిక్ టీమ్
- త్వరలోనే పరిశోధనలు ప్రారంభిస్తామని ప్రకటన
- డేటా లేని ఈ పరిశోధన సవాల్ తో కూడుకున్నదని వెల్లడి
- లక్ష డాలర్ల దాకా ఖర్చు చేస్తారంటున్న నిపుణులు
గ్రహాంతరజీవులు (ఏలియన్లు) ఉన్నాయా? ఇటీవల మన ఆకాశంలో కనిపించిన అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ (యూఎఫ్ వో) వాటి వాహనాలేనా?.. ఈ ప్రశ్నలు కొన్ని వందల ఏళ్ల నుంచి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. తాజాగా ఆ ప్రశ్నల చిక్కుముడులను విప్పేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నడుం బిగించింది. అంతుచిక్కని యూఎఫ్ వోల గుట్టు తేల్చేందుకు, అత్యంత ప్రమాదకరమైన, అత్యంత ప్రభావవంతమైన సైన్స్ విషయాలను నిర్ధారించేందుకు ఓ సైంటిఫిక్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఇప్పుడున్న సమాచారం ఆధారంగా పరిశోధనలు సాగుతాయని, దానికితోడు మరింత డేటాను సంపాదించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తామని నాసా సైన్స్ మిషన్ చీఫ్ థామస్ జూర్బుచెన్ అన్నారు. తమ పేరు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుందన్న సంశయాలేవీ లేవని, కాకపోతే అసలు డేటా అంటూ లేని ఇలాంటి సమస్యపైనే పరిశోధనలు చేయడం సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లోనే సైంటిస్టుల టీమును ప్రకటిస్తామని తెలిపారు. పరిశోధనలపై లక్ష డాలర్ల దాకా ఖర్చు చేయవచ్చని తెలుస్తోంది.