అసదుద్దీన్ పై కేసుకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన.. 30 మంది అరెస్ట్

  • వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • ప్రకటించిన ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్
  • వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అసదుద్దీన్ పేరు తొలగించాలన్న డిమాండ్
ఎంఐఎం నేత అసదుద్దీన్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చడాన్ని నిరసిస్తూ ఢిల్లీలో నిరసనకు దిగిన 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట వారు నిరసనకు దిగడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. 

మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా బీజేపీ బహిష్కృత నేతలు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీంతో ఈ అంశంలో అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. ఫలితంగా విద్వేష వ్యాఖ్యల కేసులో బీజేపీ మాజీ నేతలైన నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్, అసదుద్దీన్ ఒవైసీ సహా 33 మంది పేర్లు ఉన్నాయి. మొత్తం రెండు కేసులు నమోదు చేశారు. దీంతో అసదుద్దీన్ పేరును కేసు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు గురువారం సాయంత్రం ఆందోళనకు దిగారు. 

186, 188, 353, 332, 147, 149, 34 సెక్షన్ల కింద నిరసనకారులను అరెస్ట్ చేసినట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమృత గుగులోత్ ప్రకటించారు.


More Telugu News