ఈ బ్యాంకుల్లో గృహరుణాల రేట్లు తక్కువే!

  • నెలన్నర వ్యవధిలో 0.90 శాతం పెరిగిన రెపో రేటు
  • దీని ఆధారంగానే రుణ రేట్లను నిర్ణయించనున్న బ్యాంకులు
  • ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తక్కువ రేట్లు
సొంతిల్లు ఎంతో మంది కల. రుణం తీసుకుని ఇల్లు సమకూర్చుకునే వారే ఎక్కువ మంది ఉంటారు. కనుక రుణ రేటు కీలకం అవుతుంది. నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ ఎంతన్నది రుణం, కాల వ్యవధి ఆధారంగానే నిర్ణయం అవుతుంది. బ్యాంకు వడ్డీ రేట్లకు ప్రామాణికమైన రెపో రేటును ఆర్బీఐ గత నెలన్నర వ్యవధిలో మొత్తం మీద 0.90 శాతం పెంచింది. కనుక గృహరుణం తీసుకునే వారు కొంచెం తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకులను సంప్రదించడం సాధారణమే. ఈ క్రమంలో తక్కువ గృహ రుణ రేట్లు ఏ బ్యాంకుల్లో ఉన్నాయంటే.. 

బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలో గృహ రుణాలపై వడ్డీ రేటు 6.8 శాతం నుంచి మొదలవుతోంది. గరిష్ఠ రేటు 8.6 శాతంగా ఉంది. కనిష్ఠం, గరిష్ఠం ఏమిటి? అన్న సందేహం రావచ్చు. రుణం ఎంత కాలానికి తీసుకుంటున్నారు? రుణ గ్రహీత గత రుణాల విషయంలో చెల్లింపులు ఎలా చేశాడు? (క్రెడిట్ హిస్టరీ) తదితర అంశాల ఆధారంగా రుణ రేటును బ్యాంకులు నిర్ణయిస్తాయి.

బ్యాంకు ఆఫ్ బరోడాలో కనీస రేటు 6.9 శాతం, గరిష్ఠ రేటు 8.25 శాతంగా ఉంది. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో కనిష్ఠ రేటు 6.9 శాతం గరిష్ఠ రేటు 8.6 శాతం మధ్య ఉంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 6.9 శాతం, 7.75 శాతం మధ్య ఉంది. బ్యాంకు ఆఫ్ ఇండియాలో 6.9 శాతం, 8.6 శాతం మధ్య గృహ రుణ రేట్లు ఉన్నాయి. 



More Telugu News