తిరుమ‌ల‌లో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను క‌లిసిన క‌ఠారి హేమ‌ల‌త‌

  • 2015లో క‌ఠారి దంప‌తుల హ‌త్య‌
  • చిత్తూరు న‌గ‌రపాల‌క సంస్థ కార్యాల‌యంలోనే ఘ‌ట‌న‌
  • ఈ కేసుపై ఇంకా కొన‌సాగుతున్న విచార‌ణ‌
  • తిరుమ‌ల‌లో సీజేఐని క‌లిసిన క‌ఠారి హేమ‌ల‌త‌
  • కేసు విచార‌ణ త్వరిత‌గ‌తిన ముగిసేలా చూడాల‌ని విన‌తి
తిరుమ‌లకు వ‌చ్చిన సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు గురువారం ఓ అరుదైన విన‌తి అందింది. చిత్తూరు న‌గ‌రానికి చెందిన క‌ఠారి హేమ‌ల‌త‌ అనే మ‌హిళ సీజేఐకి ఓ విన‌తి ప‌త్రం అంద‌జేశారు. త‌న అత్తామామ‌లు క‌ఠారి మోహ‌న్‌, క‌ఠారి అనురాధ‌ల హ‌త్య కేసు విష‌యంపై ఆమె జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు ఓ విన‌తి ప‌త్రం అంద‌జేశారు. త‌న అత్తామామ‌లు హ‌త్య‌కు గుర‌య్యార‌ని, ఈ కేసు విచార‌ణ‌లో జాప్యం చోటుచేసుకుంటోంద‌ని ఆమె తెలిపారు. కేసు విచార‌ణ‌ను త్వ‌రిత‌గతిన పూర్తి చేసి దోషుల‌కు క‌ఠిన శిక్ష‌లు ప‌డేలా ఆదేశాలు జారీ చేయాల‌ని ఆమె జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు విజ్ఞ‌ప్తి చేశారు. 

చిత్తూరు న‌గ‌రానికి చెందిన క‌ఠారి మోహ‌న్ టీడీపీలో కీల‌క నేతగా కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో చిత్తూరు న‌గ‌ర పాల‌క సంస్థ చైర్ ప‌ర్స‌న్‌గా ఆయన భార్య కఠారి అనురాథ ఎన్నిక‌య్యారు. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల నేప‌థ్యంలో అప్ప‌టికే ప‌లు కేసులు న‌మోదైన క‌ఠారి మోహ‌న్‌కు న‌గ‌రంలో వ‌ర్గ శ‌త్రువుల నుంచి దాడి పొంచి ఉండేది. ఈ క్ర‌మంలో చిత్తూరు న‌గ‌ర పాల‌క సంస్థ కార్యాల‌యంలో చైర్ ప‌ర్స‌న్ సీటులో కూర్చున్న అనురాధ‌, ఆమె ముందు కూర్చున్న క‌ఠారి మోహ‌న్‌ల‌ను వారి అల్లుడు చింటూ రాయ‌ల్‌ అత్యంత కిరాత‌కంగా హ‌త్య చేశాడు. 2015లో జరిగిన ఈ హత్యోదంతంపై విచారణ ఇంకా కొన‌సాగుతోంది.


More Telugu News