కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు హైదరాబాద్ పోలీసు అధికారులకు ఊరట
- భార్యాభర్తల వివాదంలో జూబ్లీ హిల్స్ పోలీసు అధికారుల కోర్టు ధిక్కరణ
- నలుగురికి 4 వారాల జైలు శిక్ష విధిస్తూ సింగిల్ జడ్జీ తీర్పు
- తీర్పుపై చీఫ్ జస్టిస్ బెంచ్‌లో అప్పీల్ చేసిన పోలీసులు
- శిక్షను నిలుపుదల చేస్తూ స్టే విధించిన చీఫ్ జస్టిస్ బెంచ్
కోర్టు ధిక్కరణ కేసులో 4 వారాల జైలు శిక్షకు గురైన నలుగురు హైదరాబాద్ పోలీసు అధికారులకు ఊరట లభించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ తీర్పుపై స్టే విధించింది. పోలీసు అధికారులు దాఖలు చేసుకున్న అప్పీల్ పిటిషన్‌పై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
భార్యాభర్తల వివాదానికి సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీసులు నిబంధనలు పాటించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇరు వర్గాల తరఫున వాదనలు విన్న న్యాయమూర్తి... జూబ్లీ హిల్స్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ హోదాలో ఎస్సై నరేశ్, సీఐ రాజశేఖరరెడ్డి, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, నాడు వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేసిన ఏఆర్ శ్రీనివాస్‌లకు నాలుగు వారాల జైలు శిక్షను విధించారు. ఈ శిక్షను నిలుపుదల చేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధించింది.