కేసీఆర్ పాలనకు, వైఎస్సార్ పాలనకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది: షర్మిల

  • కరెంట్, ఆర్టీసీ ఛార్జీలను వైఎస్ పెంచలేదన్న షర్మిల 
  • వైఎస్సార్ ఇండ్లు కట్టిస్తే.. కేసీఆర్ అమ్మకానికి పెట్టారని వ్యాఖ్య 
  • ఆరోగ్యశ్రీని ఎత్తేసే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారంటూ ఆరోపణ 
కేసీఆర్ పాల‌న‌కు, వైఎస్సార్ పాల‌న‌కు న‌క్క‌కు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి క‌రెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలను పెంచలేదని... కేంద్రం గ్యాస్ రేట్లు పెంచినా తానే భ‌రించారని చెప్పారు. 

రాజీవ్ స్వ‌గృహ ద్వారా వైఎస్సార్ ఇండ్లు క‌ట్టిస్తే, నేడు కేసీఆర్ వాటిని అమ్మ‌కానికి పెట్టారని విమర్శించారు. ఆరోగ్య‌శ్రీ ద్వారా వైఎస్ కార్పొరేట్ ఆసుప‌త్రుల్లో ఉచిత వైద్యం అందిస్తే, నేడు నిధులు కేటాయించ‌కుండా ఆ పథ‌కాన్ని ఎత్తేసే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారని దుయ్యబట్టారు. ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ద్వారా విద్యార్థుల‌కు ఉచిత విద్య అందిస్తే, నేడు ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ కాదు క‌దా స్కాల‌ర్ షిప్ లకు కూడా నిధులు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.


More Telugu News