దీనిని ఏమనాలి ముఖ్యమంత్రి జగన్ గారు?: సోము వీర్రాజు
- నిన్న రావులపాలెం వద్ద వీర్రాజును అడ్డుకున్న పోలీసులు
- గతంలో పోలీసు అధికారిని దుర్భాషలాడిన మంత్రి అప్పలరాజు
- తాము మాత్రం చేతులు కట్టుకుని నిలబడాలా? అని ఆగ్రహం
అమలాపురం వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును రావులపాలెం వద్ద నిన్న పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన ఎస్సైతో ఘర్షణకు దిగి, ఆయనను నెట్టేసినప్పటి వీడియో వైరల్ అయింది. దీంతో వీర్రాజుపై పోలీసు కేసు కూడా నమోదైంది.
ఈ నేపథ్యంలో సోము వీర్రాజు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పోలీసు అధికారిని మంత్రి అప్పలరాజు దుర్భాషలాడిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. దీనిని ఏమనాలి సీఎం జగన్ గారూ... మీ మంత్రులు, ఎమ్మెల్యేలు అహంకారంతో ప్రవర్తించినా రాష్ట్ర ప్రజలు, పోలీసులు వాటిని ప్రశంసలుగా స్వీకరించాలా? అని అడిగారు. ఒక ప్రైవేటు లారీని మా వాహనానికి ఎదురుగా ఉంచితే ప్రతిఘటించక గంటల పాటు తాము చేతులు కట్టుకుని నిలబడాలా? అని వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.